ప్ర‌ధాని మోదీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌ల వెల్లువ‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Sep 2020 7:33 AM GMT
ప్ర‌ధాని మోదీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌ల వెల్లువ‌

భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినం సందర్భంగా ఆయనకు సోష‌ల్‌మీడియా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. పార్టీల‌క‌తీతంగా నేత‌లు ప్ర‌ధానికి శుభాకాంక్షలు తెలియజేస్తుప‌న్నారు. రాష్ట్ర‌ప‌తి మొదలుకుని సామాన్యుల వ‌ర‌కూ ప్ర‌ధానికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

ప్ర‌ధానికి శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ముఖులు

రామ్‌నాథ్‌ కోవింద్‌

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. భారతీయ విలువలు, ప్రజాస్వామ్య విధానం పట్ల మీ విధేయత ఆదర్శప్రాయం. మీరు ఎల్లపుడూ ఆరోగ్యంగా, అనందంగా ఉండాలని.. మీ అమూల్య సేవలు దేశానికి ఎల్లపుడూ లభించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని ట్విట‌ర్ వేదిక‌గా రాష్ట్ర‌ప‌తి కోవింద్ మోదీకి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.



అమిత్‌ షా

ప్రియ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మోదీజీ రూపంలో దేశంలోని అణగారిన వర్గాలను అభివృద్ధి బాటలోకి తెచ్చి.. పటిష్ఠ భారతదేశానికి పునాది వేసిన నాయకత్వం లభించింది. ఆయన నాయకత్వంలో భరతమాతకు సేవ చేసే అవకాశం లభించటం మా అదృష్టం. మోదీజీకి సంపూర్ణ ఆయురారోగ్యాలు లభించాలని కోరుకుంటున్నానని హోంమంత్రి అమిత్ షా ట్విట్ట‌ర్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

Amit

రాజ్‌నాథ్‌ సింగ్‌

ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన చురుకైన నాయకత్వం, దృఢ చిత్తం, నిర్ణయాత్మక చర్యలతో భారత్‌ అమితంగా అభివృద్ధి చెందింది. ఆయన పేదలు, అణగారిన వర్గాల వారి సాధికారత కోసం ఆయన పట్టుదలతో కృషి చేస్తున్నారు. ఆయనకు ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ప్రార్థిస్తున్నానని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ట్వీట్ చేశారు.

రాహుల్‌ గాంధీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీకి జన్మదిన శుభాకాంక్షలు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

అరవింద్‌ కేజ్రీవాల్

మోదీజీ మీకు అమితమైన‌ సంతోషపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సార్‌. మీరు దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నానని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.



కేసీఆర్

డెబ్బ‌య‌‌వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన‌ ప‌్ర‌ధాని మోదీకి రాష్ట్ర ప్ర‌భుత్వం, తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌ఫున సీఎం కేసీఆర్ ప్ర‌ధానికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. దేశానికి మోదీ మ‌రిన్ని సేవ‌లు అందించాల‌ని సీఎం ఆకాంక్షించారు.

Kcr

వైఎస్ జ‌గ‌న్‌

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు పురస్కరించుకొని ఏపీ సీఎం వైఎస్‌ జగన్ ట్విటర్‌ ద్వారా గురువారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీజీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని.. ఎల్లప్పుడు ఆయురారోగ్యంతో ఉండాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అంటూ ట్వీట్‌ చేశారు.



చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మోదీకి ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. క్లిష్ట సమయంలో దేశాన్ని సమర్థంగా నడిపించే శక్తి భగవంతుడు మోదీకి ఇస్తాడని ఆశిస్తున్నా.. మీకు నా శుభాకాంక్షలు ఉంటాయంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.



పవన్‌ కల్యాణ్

గౌరవనీయులైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, మీకు మా అందరి తరపు నుంచి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ ఘనమైన, స్ఫూర్తినిచ్చే, అంకిత భావం కలిగిన నాయకత్వంలో మన భరతమాత విప్లవ ముని శ్రీ అరబిందో కలలుకన్న విధంగా తన నిజమైన కీర్తి శిఖరాలను తాకగలదని ఆశిస్తున్నాను అని ప‌వ‌న్ ట్వీట్ చేశారు.



Next Story