నగరంలో తెరుచుకోనున్న మద్యం షాపులు
By సుభాష్ Published on 17 Aug 2020 3:03 PM ISTదేశంలో కరోనా వైరస్ కారణంగా మద్యం షాపులు మూతపడి తిరిగి తెరుచుకున్నప్పటికీ. చెన్నైలో మాత్రం మూతపడే ఉన్నాయి. ఇందుకు కారణంగా నగరంలో కరోనా కేసుల తీవ్రత ఉండమే. అయితే తాజగా చెన్నై పరిధిలో మద్యం షాపులు తెరవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం నుంచి చెన్నైలో మద్యం షాపులు తెరబోతున్నారట.
దీంతో నగరంలో మద్యం విక్రయాలు భారీగా జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులు తెరవనున్నారు. టోకెన్ విధానం ద్వారా ప్రతి రోజు 500 మందికి మాత్రమే ప్రతి మద్యం షాపులో సేవలు అందిస్తామని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక మాల్స్, కంటైన్మెంట్ జోన్లలోని లిక్కర్ షాపులు మూసివేసి ఉంటాయని తెలిపింది.
Next Story