కరోనా విజృంభణ.. మూడు రాష్ట్రాల్లో కరోనా మరణాల రేటు ఎక్కువ

By సుభాష్  Published on  17 Aug 2020 6:03 AM GMT
కరోనా విజృంభణ.. మూడు రాష్ట్రాల్లో కరోనా మరణాల రేటు ఎక్కువ

భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 57,981 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 941 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. సోమవారం నాటికి దేశంలో మృతుల సంఖ్య 50,921 చేరింది. ఇక ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య26,47,663కు చేరింది. నిన్న ఒక్క రోజు వైరస్‌ నుంచి 57వేల మంది కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 72.5శాతం ఉండగా, మరణాల రేటు దాదాపు 1.9శాతంగా ఉంది. కాగా, ప్రస్తుతం భారత్‌లో కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ, ఎక్కవగా మరణాల రేటు మూడు రాష్ట్రాల్లోనే ఉంది.

మూడు రాష్ట్రాల్లో మరణాల రేటు ఎక్కువ

గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కరోనా మరణాల రేటు జాతీయ సగటుకంటే ఎక్కువగా ఉంది.

గుజరాత్‌ - 3.56 శాతం

మహారాష్ట్ర - 3.38 శాతం

మధ్యప్రదేశ్‌ - 2.46 శాతం

కరోనాతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి రోజుదాదాపు 300 మంది కరోనాతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకూ కరోనాతో 20వేల వరకు మృత్యువాత పడ్డారు. ప్రతి రోజు 10వేలకుపైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రతి రోజు వందకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. తమిళనాడులో కరోనాల మరణించిన వారి సంఖ్య5766 చేరగా, కర్ణాటకలో 4వేలకు చేరువలో ఉంది.

Next Story
Share it