తెలంగాణలో 92,255కు చేరిన కరోనా కేసులు

By సుభాష్  Published on  17 Aug 2020 3:51 AM GMT
తెలంగాణలో 92,255కు చేరిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న రాత్రి 8 గంటల నుంచి ఇప్పటి వరకకు కొత్తగా 894 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 92,255కి చేరింది.

అయితే కేసుల సంఖ్య కాస్త తగ్గుతుండటంతో ఊరట కలిగిస్తోందనే చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 10 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 703కు చేరింది. ఇక తాజాగా 2006 మంది కరోనా బారి నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు డిశ్చార్జీ అయిన వారి సంఖ్య 70,132కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,420 కేసులు యాక్టివ్‌లో ఉండగా, 14,404 మంది హోమ్‌, ఇనిస్టిట్యూషనల్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Ts Corona

Next Story