పుల్వామలో తప్పిన పెను ప్రమాదం.. ఐఈడీ స్వాధీనం

By సుభాష్  Published on  17 Aug 2020 3:36 AM GMT
పుల్వామలో తప్పిన పెను ప్రమాదం.. ఐఈడీ స్వాధీనం

పుల్వామాలో మరో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని తుజాన్‌ గ్రామ సమీపంలో భద్రతా బలగాలు ఆదివారం రాత్రి ఇంప్రోవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైస్‌ (ఐఈడీ)ని స్వాధీనం చేసుకున్నాయి.

తుజాన్‌ గ్రామ సమీపంలో ఒక వంతెన కింద ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీని స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ తెలిపారు.

తుజాన్‌-దాల్వాన్‌ మధ్య ఉన్న రహదారిలో అమర్చిన ఐఈడీని భద్రతా బలగాలు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పినట్లయిందని ఆయన పేర్కొన్నారు. కాగా, పుల్వామా జిల్లాను బుద్దాంతో కలిపే రహదారిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు భద్రతా బలగాలు తరచూ ఈ రహదారిని వినియోగించుకోనున్నాయి.

Next Story
Share it