వివాహం అయిన 20 రోజులకే భర్తను చంపిన భార్య
By తోట వంశీ కుమార్ Published on 12 Sept 2020 12:27 PM ISTఎన్నో ఆశలతో మెట్టినింట అడుగుపెట్టింది. అయితే.. పెళ్లైన రోజు నుంచే భర్త రోజు తాగి వచ్చి నిత్యం గొడవ పడుతుండేవాడు. దీంతో ఆమె కన్న కలలు.. కలలుగానే మిగిలాయి. రోజు రోజుకు భర్త వేదింపులు ఎక్కువ అవుతుండడంతో.. ఆవేశంలో రోకలి బండతో భర్త తలపై గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు ఉన్నచోటే కుప్పకూలిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. ఈ ఘటన టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అస్లామ్ ఫర్నీచర్ దుకాణంలో పనిచేసే వాడు. ఇటీవల అతడికి సమ్రీన్(20) అనే యువతితో వివాహం జరిపించారు కుటుంబసభ్యులు. పెళ్లి జరిగి 20 రోజులు కూడా కాలేదు. వివాహం జరిగిన రోజు నుంచే అస్లాం రోజు తాగొచ్చి భార్య సమ్రీన్‌తో గొడవ పడుతుండేవాడు. భర్త నిత్యం పెట్టే టార్చర్‌తో విసిగిపోయింది. శుక్రవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో.. ఆవేశంలో సమ్రీన్ పక్కనే ఉన్న రోకలిబండతో అస్లాం తలపై బలంగా కొట్టింది. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు టప్పాచబుత్ర పోలీసులు భర్తను హత్య చేసిన సమ్రీన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.