శ్రావణి ఆత్మహత్య కేసు: బయటపడుతున్న దేవరాజ్‌ భాగోతం.. రోజుకో మలుపు..!

By సుభాష్  Published on  11 Sep 2020 8:35 AM GMT
శ్రావణి ఆత్మహత్య కేసు: బయటపడుతున్న దేవరాజ్‌ భాగోతం.. రోజుకో మలుపు..!

బుల్లితెర నటి, మౌనరాగం సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టిక్‌టాక్‌ను అడ్డం పెట్టుకుని ఎంతోమంది అమ్మాయిలను తన వెంట తిప్పుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దేవరాజ్‌ ఓ ప్లే బాయ్‌గా నిర్ధారించారు పోలీసులు. పలువురు అమ్మాయిలతో ప్రేమాయణం నడిపినట్లుగా విచారణలో వెల్లడైంది. టిక్‌టాక్‌ వీడియోల ద్వారా ఆ విషయాలను పోలీసులు నిర్ధారించుకున్నారు. అదే మాదిరిగా శ్రావణిని కూడా ప్రేమ పేరుతో ఉచ్చులో దింపినట్లు పోలీసులు గుర్తించారు.

అయితే తనతో పాటు మరి కొందరి అమ్మాయిలతో దేవరాజ్‌ ప్రేమాయణం కొనసాగించినట్లు గుర్తించిన శ్రావణి.. అతన్ని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు గుర్తించారు. పోలీసుల ఆదేశాల మేరకు కాకినాడ నుంచి దేవరాజ్‌ హైదరాబాద్‌కు వచ్చి లొంగిపోయినట్లు ఎస్సార్‌ నగర్‌ సీఐ నర్సింహారెడ్డి తెలిపారు. ప్రస్తుతం దేవరాజ్‌ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు విచారిస్తున్న కొద్ది రోజురోజుకు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అతడి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేయనున్నారు. తన వద్ద ఉన్న కాల్ రికార్డులను దేవరాజ్‌ పోలీసులకు సమర్పించాడు. కాగా, దేవరాజ్‌ తన కుమార్తెను వేధింపులకు గురి చేశాడని శ్రావణి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

పోలీసుల ముందు సంచలన విషయాలు చెప్పిన దేవరాజ్‌

మరో అనుమానితుడు సాయికృష్ణ వల్లనే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపాడు. మరో వైపు సాయికృష్ణనే శ్రావణికి చిత్ర హింసలు గురి చేశాడని, అందువల్లనే చనిపోయిందని దేవరాజ్‌ ఆరోపిస్తున్నాడు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు.

అంతేకాకుండా పోలీసుల విచారణలో దేవరాజ్ మరికొన్ని‌ సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సాయి సాయికృష్ణ అకృత్యాలను పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. శ్రావణి కుటుంబ సభ్యులు, సాయి కొట్టడంతోనే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు దేవరాజ్‌ పోలీసులు ముందు చెప్పినట్లు తెలుస్తోంది. తన చావుకు సాయియే కారణమని చివరిసారిగా శ్రావణి మాట్లాడిన ఆడియో, అలాగే గతంలో సాయి తనపై దాడి చేసిన సాక్ష్యాలను దేవరాజ్‌ పోలీసుల ముందు ఉంచాడు. కృష్ణానగర్‌లో అమ్మాయిలను సాయి ట్రాప్‌ చేస్తాడని, శ్రావణిని సైతం వదిలి పెట్టలేదని దేవరాజ్‌ పోలీసుల ముందు చెప్పుకొచ్చాడు. అలాగే ఈ కేసులో ఆర్‌ఎక్స్‌ 100 సినిమా నిర్మాత అశోక్‌రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా శ్రావణి ఆత్మహత్యకు సంబంధించి ఈ ముగ్గురి పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Next Story
Share it