అయ్యప్ప దర్శనం కోసం ఆ శునకం ఏం చేసిందంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Nov 2019 11:10 AM GMT
అయ్యప్ప దర్శనం కోసం ఆ శునకం ఏం చేసిందంటే..!

కేరళ: శబరిమల ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. స్వామి వారికి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీక్ష స్వీకరించిన భక్తులు అయ్యప్ప దర్శనానికి బయల్దేరారు. అయితే ఈ సారి భక్తులతో పాటు ఈ సారి ఓ విధి కుక్క కూడా స్వామి వారిని దర్శించుకునేందుకు బయల్దేరింది. శబరిమలకు పయనమైన ఆ వీధికుక్క గురించి తెలుసుకుంటున్న భక్తులు నోరెళ్లబెడుతున్నారు. అలసట, అలుపు లేకుండా వందల కిలోమీటర్లు నడిచిన ఆ శునకం అయ్యప్ప సన్నిధికి చేరుకుంటుందో లేదో చూడాలి.

అక్టోబర్‌ 31న తిరుమల నుంచి 13 మంది భక్తులు శబరిమలకు కాలినడక ప్రారంభించారు. వీరి వెంట ఓ శునకం కూడా వచ్చింది. అయితే ఆ శునకం తమతోనే వస్తున్న వారు గుర్తించలేదు. వెనక్కు తిరిగిన ప్రతిసారి కుక్క ఉండటంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. అలా స్వాములతో ఆ శునకం 480 కిలోమీటర్లు నడిచింది. కాలినడకన శబరిమలకు బయల్దేరిన భక్తులు ప్రస్తుతం కర్నాటకలోని కొట్టిగెరాకు చేరుకున్నారు. వారి తెచ్చుకున్న ఆహార పదార్థాల్లో కొంత మొత్తం ఆ శునకానికి పెడుతూ వస్తున్నారు. అయితే తాము ప్రతి సంవత్సరం కాలినడకన శబరిమల వెళ్తామని భక్తులు తెలిపారు. ఈ సంవత్సరం శబరిమలకు తమతో పాటు ఓ శునకం రావడం మర్చిపోలేని తీపి జ్ఞాపకమని భక్తులు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Next Story