అది సాలీడా ? నెట్టింట్లో వైరల్ అవుతోన్న వీడియో..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Jun 2020 9:44 AM IST
అది సాలీడా ? నెట్టింట్లో వైరల్ అవుతోన్న వీడియో..

సాధారణంగా పాముల్లో చాలా రకాలుంటాయి. మీరు కూడా చూసి ఉంటారు కూడా.. పల్లెటూళ్లలో అయితే ఇళ్ల చుట్టుపక్కల ఎక్కువగా..త్రాచు పాము, కట్లపాము, బురదగొయ్యి, జరిగొడ్డు లాంటి పాములు కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోన్న వీడియో ఒకటి నెటిజన్లను సందిగ్ధంలో పడేసింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అనుకుంటున్నారా ? కింద వీడియో ఓపెన్ చేసి చూడండి.



చూశారుగా..ఆ వీడియోలో ఉన్నది పామో, సాలీడో అర్థం కావడం లేదు కదా. నెటిజన్లు కూడా అదే ఆశ్చర్యపోయారు. బహుశా ఇది స్నేక్ సాలీడు అయి ఉంటుందని..ఈ వింత జంతువుకి పేరు కూడా పెట్టేశారు. మధ్యలో సాలీడులాగే ఉన్నా, దానీ కాళ్లు మాత్రం పాముల్లాగే ఉన్నాయి. ఇక నిదానంగా పాములాగే కదులుతూ అది కాస్త సముద్రంలోకి వెళ్లిపోయింది.

Next Story