నేడు భారీ వర్షాలు.. పిడుగులు పడే అవకాశం
ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది.
By అంజి Published on 20 March 2024 6:30 AM ISTనేడు భారీ వర్షాలు.. పిడుగులు పడే అవకాశం
ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.రాబోయే రెండు రోజుల్లో శ్రీకాకుళం, ఏలూరు, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, ఉమ్మడి గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి.
అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. పిడుగులు పడే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది. నిన్న సిద్ధిపేట జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడగా.. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన విరుచుకుపడింది. దీంతో ఎక్కడికక్కడ చెట్లు, హోర్డింగ్‌లు నేలకొరిగాయి.