ఇవాళ, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా కర్ణాటక తీరంలోని తూర్పు మధ్య అరేబియా సముద్ర పరిసర ప్రాంతాల నుండి తెలంగాణ వరకు వ్యాపించిన ఉపరితల ద్రోణి ఇవాళ బలహీన పడింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల నుండి వెళ్లిపోయాని, తూర్పు మధ్య పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం.. ఇవాళ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలకి ఉత్తరం వైపు కేంద్రీకృతం కానుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకి వెళ్లేకొలది నైరుతి దిశ వైపుకి వంపు తిరుగుతుంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి.. రాగల 24 గంటల్లో దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రా తీరంకి చేరుకునే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అంజి

Next Story