Telangana: బీ అలర్ట్‌.. రానున్న రోజుల్లో తీవ్రమైన వేడిగాలులు

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలు రానున్న రోజుల్లో తీవ్ర వేడిని చవిచూసే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు

By అంజి  Published on  11 April 2023 5:04 AM GMT
Telangana , IMD-H, Hyderabad ,  temperature

Telangana: బీ అలర్ట్‌.. రానున్న రోజుల్లో తీవ్రమైన వేడిగాలులు

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలు రానున్న రోజుల్లో తీవ్ర వేడిని చవిచూసే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నందున, భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ (IMD) బుధవారం వరకు నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. IMD-H ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో నగరం, దాని పరిసర ప్రాంతాలలో గురువారం నుండి ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌ను దాటే అవకాశం ఉంది.

హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

మరోవైపు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. తీవ్రమైన వేడి, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు రోజు పీక్ అవర్స్‌లో ఇంట్లోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని ఐఎండీ సూచించింది. వాతావరణం వేడిగా, పొడిగా ఉండవచ్చని భావిస్తున్నప్పటికీ.. మంగళవారం నుండి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వేడి వాతావరణం కారణంగా ఇది వాతావరణంలో అస్థిరతను సృష్టిస్తుందని భావిస్తున్నారు.

Next Story