అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ చెదురుముదురుగా భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, మిగతా జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
మరో వైపు ప్రకాశం బ్యారేజీకి వరద పెరుగుతుందని, కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, పంట్లు నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని సూచించింది. అత్యవసర సహాయం కోసం 1070, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయాలని సూచించింది.