Respite from heavy rains likely for next two days in Telangana. హైదరాబాద్‌లో కురుసిన భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. తెల్లవారుజామున 5 గంటల నుంచి కురుస్తున్న
మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో కురుసిన భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. తెల్లవారుజామున 5 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. కాగా హైదరాబాద్ నగరంలో సాయంత్రం వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ముసురు కొనసాగుతోంది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రేపటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. రానున్న రెండు రోజులు హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీల సెల్సియస్, 20 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. మంగళవారం నగరంలోని శేరిలింగంపల్లి, షేక్‌పేట్, ఆసిఫ్‌నగర్‌లో అత్యధికంగా 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, చార్మినార్, ఖైరతాబాద్‌లో 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని నిజామాబాద్‌లోని డిచ్‌పల్లిలో 27 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లాలోని సిర్కొండ, బోధన్‌లో 26.8 మిల్లీమీటర్లు, 25.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేట, జనగాం, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి సహా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురిశాయి.