ఆదిలాబాద్, కుమ్రంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా, ప్రమాదకర వాగులను ప్రజలు దాటకుండా చూడాలన్నారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేస్త్రశించింది. పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, కుమ్రంభీం, మంచిర్యాల, హన్మకొండ, జగిత్యాల, ఖమ్మం, కొత్తగూడెం, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించిందని పేర్కొన్నారు.