ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది
By Knakam Karthik
ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. రుతుపవన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఇవాళ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగం, సిద్దిపట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఏపీలోనూ రెండ్రోజుల పాటు వర్షాలు..
రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజులు జోరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని జిల్లాలో జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది అని వాతావరణ కేంద్రం తెలిపింది.