తెలంగాణ, ఏపీలో మరో రెండ్రోజులపాటు వర్షాలు
Rains in Telangana and AP. తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ
By అంజి Published on
16 Oct 2021 6:37 AM GMT

తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు ఇవాళ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల నుంచి ఉపసంహరించాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తూర్పు మధ్య, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలకు ఉత్తరం వైపు కేంద్రీకృతమై ఉందన్నారు. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 24 గంటల్లో ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చెరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోస్తా కర్ణాటక తీరంలోని తూర్పు మధ్య అరేబియా సముద్ర పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణ వరకు వ్యాపించిన ఉపరితల ద్రోణి బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
Next Story