అమరావతి: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. డిసెంబర్ 7వ తేదీ నుంచి ఏపీలో వాతారణం పొడిగా మారే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి వర్ష సూచన లేదని తెలిపింది.
అటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నాలుగైదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవు. వచ్చే వారంలో రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని పేర్కొంది. డిసెంబర్ 11వ తేదీ వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.