ఉత్తర కోస్తా సమీపంలో ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర కోస్తా పరిసరాల్లో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం రాబోయే 24 గంటల్లో అల్పపీడనంగా బలపడనుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలోని ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు. కోస్తాంధ్ర అంతటా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరో వైపు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉద్ధృతి కొనసాగుతోంది. అధికారులు ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.