ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు

By -  Medi Samrat
Published on : 27 March 2026 7:30 PM IST

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు

రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరాఠ్వాడా నుంచి కర్ణాటక తీరం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఏపీ, యానాంలో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

Next Story