తెలంగాణకే కాదు.. ఏపీకి కూడా పొంచి ఉన్న ముప్పు

Rain Alert For Telugu States. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్న సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on  20 July 2023 2:15 PM GMT
తెలంగాణకే కాదు.. ఏపీకి కూడా పొంచి ఉన్న ముప్పు

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇప్పుడు ఏపీకి కూడా వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్రా, తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, అల్లూరి సీతారామరాజులలో అతి భారీ వర్షాలు.. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ సమయంలో తీరం వెంబడి గంటకి 40 నుండి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. రానున్న ఐదు రోజులు వర్షాల ప్రభావం కొనసాగుతుందని తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని.. ఈ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

గోదావరి ఉధృతి పెరుగుతూ ఉండడంతో అధికారులను హెచ్చరించారు. ముందస్తు సహాయక యక చర్యలకు అల్లూరికు ఎన్డీఆర్ఎఫ్, ఏలూరుకు రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించారు. విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 18004250101గా అధికారులు తెలిపారు. జిల్లాల్లో మండలస్థాయిలో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.


Next Story