తెలంగాణకు రెయిన్‌ అలర్ట్‌.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

By అంజి  Published on  14 July 2024 5:29 PM IST
Rain alert, Telangana, heavy rains, IMD

తెలంగాణకు రెయిన్‌ అలర్ట్‌.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

హైదరాబాద్: రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల విస్తరణకు తోడు.. ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఐఎండీ ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ఆదిలాబాద్‌, కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు.

సోమవారం జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఉంటుంది. అలాగే ఆదిలాబాద్‌, కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌, హన్మకొండలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. మెరుపులతో కూడిన ఉరుములు, ఈదురు గాలులు ఇతర చోట్ల సంభవించే అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లోనూ ఈ జిల్లాలతోపాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్‌లో ఈరోజు ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి.

Next Story