పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సరాసరి సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని ప లు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు వాతావరణ సూచనలు జారీ అయ్యాయి. సూచన ప్రకారం, ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.