ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలి!

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌ విభాగం తెలిపింది.

By అంజి  Published on  6 Oct 2024 4:20 PM IST
IMD, Hyderabad, thunderstorm, lightning, Telangana

ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలి!

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌ విభాగం తెలిపింది. రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబరు 6, 7 తేదీల్లో ఈ హెచ్చరిక అమలులో ఉంటుంది.

ఐఎండీ హైదరాబాద్‌ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. హైదరాబాద్‌లో, అక్టోబర్ 9 వరకు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఈ సమయంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని IMD అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల సమయంలో తెలంగాణలో వర్షపాతం గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో సగటున 962.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, సాధారణ వర్షపాతం 738.6 మిమీతో పోలిస్తే 30 శాతం పెరిగింది. ఇక హైదరాబాద్‌లో 825.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Next Story