తెలంగాణలో 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు.. ఐఎండీ హెచ్చరిక జారీ

ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉన్నందున తెలంగాణలోని వివిధ జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

By అంజి  Published on  2 April 2024 9:50 AM IST
IMD Hyderabad, temperatures , 44 degrees celsius, Telangana

తెలంగాణలో 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు.. ఐఎండీ హెచ్చరిక జారీ

హైదరాబాద్: ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉన్నందున తెలంగాణలోని వివిధ జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. నిన్న నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగా, పెద్దపల్లిలో 42.9 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్‌ అంచనా వేసింది. తెలంగాణలోని జగిత్యాల, గద్వాల్, కామారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో నేడు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ రానున్న కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉంది.

ఏప్రిల్ 5న అత్యధిక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌ నగరంలో ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్‌కు చేరువలో ఉంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) ప్రకారం, హైదరాబాద్‌లో, ఖైరతాబాద్‌లో నిన్న 41.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫ్‌నగర్‌, చార్మినార్‌, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, మారేడ్‌పల్లి, గోల్కొండలో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్‌ను అధిగమించాయి. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగే అవకాశం ఉన్నందున, హైదరాబాద్ ఐఎండీ ఏప్రిల్ 5 వరకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

Next Story