AP: బీ అలర్ట్‌.. నేడు 130 మండలాల్లో తీవ్ర వడగాలులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు మండలాల్లో నేడు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

By అంజి  Published on  4 April 2024 12:50 AM GMT
Hot winds, 130 mandals , Andhra Pradesh, Summer

AP: బీ అలర్ట్‌.. నేడు 130 మండలాల్లో తీవ్ర వడగాలులు 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు మండలాల్లో నేడు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు వివిధ జిల్లాల్లోని 130 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని చెప్పింది. శ్రీకాకుళం జిల్లాలో 4, విజయవనగరం జిల్లాలో 19, ఎన్టీఆర్ 14, గుంటూరు 5, పార్వతీపురం మన్యం 12, అల్లూరి సీతారామరాజు 4, కాకినాడ 9, తూర్పుగోదావరి 3, అనకాపల్లి 13, కృష్ణా 1, పల్నాడు 6, నంద్యాల 19, అనంతపురం 1, వైఎస్సార్ కడప జిల్లాలో 20 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

కడప జిల్లా ఒంటిమిట్టలో నిన్న 43.4డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. అనంతపురం జిల్లా తెరన్నపల్లి, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరులో 43.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కడపజిల్లా వీరాపునాయుని మండలంలో తీవ్రవడగాల్పులు, 59 మండలాల్లో వడగాల్పులు వీచాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి, వృద్దులు,గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓఆర్‌ఎస్‌ తాగాలని అధికారులు సూచించారు.


Next Story