తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున్న ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
అలాగే జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.