తెలంగాణ, ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్
నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By - అంజి |
తెలంగాణ, ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్
నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. నేడు (గురువారం) కృష్ణా, ప్రకాశం,నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుత సమాచారం బట్టి రేపటి నుంచి చాలా వరకు పొడి వాతావరణం ఉండే సూచనలు ఉన్నాయన్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రకాశం(జి) బి.చెర్లపల్లిలో 65.2మిమీ, శ్రీసత్యసాయి(జి)గండ్లపెంటలో 45మిమీ, నెల్లూరు(జి)రాపూర్ 40.5మిమీ, విజయవాడ తూర్పులో 39మిమీ చొ
నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.గురువారం కృష్ణా, ప్రకాశం,నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, pic.twitter.com/ATn08EVnNh
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) November 5, 2025
ప్పున వర్షపాతం నమోదైందన్నారు.
తెలంగాణలో కూడా గురువారం వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. ప్రధానంగా ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో (గంటకు 30-40 కిమీ వేగంతో) కూడిన వర్షాలు కురిసే అవకాశాలుండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.