తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ నెల 14 వరకు ఎల్లో అలర్ట్
Heavy rains in Telangana till 14th of this month. తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. ఈ నెల 14 వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే
By అంజి Published on 10 Oct 2022 2:10 AM GMTతెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. ఈ నెల 14 వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలు పడే అవకాశం ఉందని, ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌లో శనివారం కురిసిన భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. భారీ వర్షం కారణంగా వరదలు పొంగిపొర్లుతుండటంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రానున్న మూడు రోజులపాటు హైదరాబాద్ నగరంలో ఇదే తరహాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగంలో సైంటిస్ట్ సి ఇన్‌చార్జి ఎ శ్రావణి ప్రకారం.. ప్రస్తుతం ఉన్న తక్కువ స్థాయి ఆగ్నేయం నుండి శీతల గాలుల కారణంగా వచ్చే ఒక వారం నగరంలో భారీ వర్షాలు కొనసాగుతాయి. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంతో పాటు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ గణాంకాల ప్రకారం.. శనివారం హైదరాబాద్‌లోని పశ్చిమ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది, షేక్‌పేట్ (160.3 మిమీ), మాదాపూర్ (128.3 మిమీ), జూబ్లీ హిల్స్ (115 మిమీ) దాటింది. అయితే ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు హైదరాబాద్ నగరంలో పెద్దగా వర్షపాతం నమోదు కాలేదు. ఆదివారం కూడా వరంగల్‌లోని దుగ్గొండిలో అత్యధికంగా 113.5 మి.మీ, దుద్యాలలో వికారాబాద్‌లో 42.3 మి.మీ, వరంగల్‌లోని లక్ష్మీదేవిపేటలో 37.3 మి.మీ వర్షపాతం నమోదైంది. మరి కొన్ని జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది.