తెలంగాణ, ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు

Heavy rains for 3 days in Telangana and AP. తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

By అంజి  Published on  28 July 2022 7:19 PM IST
తెలంగాణ, ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కొమొరిస్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర దక్షిణ ద్రోణి బలహీనపడింది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

శనివారం పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్‌ ఉందని తెలిపింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని, నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. శుక్రవారం మోస్తరుతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్లో అలెర్ట్‌ కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా.. మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో కొన్నిచోట్ల పిడుగులు పడే పడే అవకాశం ఉందని, ప్రజలు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించింది. దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు ఉండగా, రాయలసీమకు ఎలాంటి వర్ష సూచన లేదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

Next Story