అమరావతి: వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం ఉదయం ఒడిశా- ఉత్తర కోస్తా సమీపంలో గోపాల్‌పూర్ వద్ద తీరం దాటింది. తీర ప్రాంతాల్లో 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. గడిచిన 6 గంటల్లో 7 కిలో మీటర్ల వేగంతో వాయుగుండం కదిలినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అలాగే వాయుగుండం తీరం దాటినప్పటికి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లోదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే వాయుగుండం తీరం దాటినప్పటికీ ఏపీలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.