తెలంగాణ, ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి
తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, జనగాం, యాదాద్రి భువనగిరి, నల్గొండ, గద్వాల, వనపర్తి, సూర్యాపేట, నారాయణపేట జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, హైదరాబాద్ సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.
ఏపీలో నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.హోర్డింగ్స్,చెట్లు,శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు. అలాగే విశాఖ, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.