బిగ్ అలర్ట్.. ఇవాళ అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
మొంథా తీవ్ర తుఫానుతో రాష్ట్రంలో ఇవాళ అతిభారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం,
By - అంజి |
బిగ్ అలర్ట్.. ఇవాళ అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
అమరావతి: మొంథా తీవ్ర తుఫానుతో రాష్ట్రంలో ఇవాళ అతిభారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నందర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తుఫాను వల్ల రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారని మంత్రి నారా లోకేషన్ తెలిపారు. కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను అత్యధిక తీవ్రత కలిగిన ప్రాంతాలుగా గుర్తించామన్నారు. అవి రెడ్ అలర్ట్‌లో ఉన్నాయన్నారు. ఎలాంటి ప్రాణం నష్టం ఉండకూడదనేదే తమ లక్ష్యం అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు లోకేష్ ఆర్టీజీఎస్ కేంద్రంలోనే ఉన్నారు.
అటు తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. జోగులాంబ గద్వాల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నల్గొండ, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్, మంచిర్యాల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ వానలు కురుస్తున్నాయి. ఈ మేరకు ఎల్లోఅలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.