తీవ్ర వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన.. నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై...

By -  అంజి
Published on : 10 Jan 2026 9:11 AM IST

APSDMA , rains, APnews, cyclonic storm, IMD

తీవ్ర వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన.. నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై ఉందని దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీవ్ర వాయుగుండం నేటి మధ్యాహ్నం సమయంలో ఉత్తర శ్రీలంక ట్రింకోమలీ - జాఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది.

తీరం దాటిన తర్వాత ఇది క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. గంటకు సుమారు 13 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం వాయువ్య దిశగా కదులుతోందని తెలిపారు. కాగా వాయుగుండం ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, శ్రీలంక తీర ప్రాంతాల్లో వాతావరణం వేగంగా మారుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం దక్షిణ భారత తీరం వైపు పయనిస్తోందని తెలిపింది. వాయుగుండం ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో మేఘావృత వాతావరణం నెలకొంది.

Next Story