రాష్ట్రంలో మరో అల్పపీడనం..రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

ఉపరితల ఆవర్తనము ప్రభావంతో రేపటికి దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

By -  Knakam Karthik
Published on : 21 Nov 2025 6:27 PM IST

Weather News, Andrapradesh, Rain Alert, Heavy Rains, Another low pressure, State Disaster Management Authority

రాష్ట్రంలో మరో అల్పపీడనం..రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

అమరావతి: ఉపరితల ఆవర్తనము ప్రభావంతో రేపటికి దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమవాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ఏర్పడే నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. శనివారం (22-11-25) ప్రకాశం, నెల్లూరు,కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Next Story