అలర్ట్‌.. మరో అల్పపీడనం.. మళ్లీ వర్షాలు

రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది.

By అంజి  Published on  13 Sept 2024 6:29 AM IST
Bay of Bengal, Rains, IMD, APnews

అలర్ట్‌.. మరో అల్పపీడనం.. మళ్లీ వర్షాలు

రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో విస్తారంగరా వర్షాలు పడతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశప్‌పై ప్రభావం స్వల్పంగానే ఉన్నా.. రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అటు ఈ నెల 20 నుంచి అక్టోబర్‌ మొదటి వారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. రుతుపవన ద్రోణి ఉత్తర కోస్తా జిల్లాలకు దగ్గరగా కొనసాగుతుండటంతో అల్పపీడనాలు ఎక్కువగా ఏర్పడటానికి అవకాశాలున్నాయి.

ఈ ప్రభావంతోనే ఈనెల చివరివారంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరోవైపు ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఏపీ ఐపు కదిలే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఒక వేళ అదే జరిగితే ఏపీ మరోసారి వాన గండాన్ని ఎదుర్కోనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదతో జనజీవనం అస్తవ్యస్తం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే జనం వరద గుప్పిట నుంచి కొద్దిగా బయటకు వస్తున్నారు. వరదల వల్ల ఇంట్లో ఎన్నో విలువైన వస్తువులు, సర్టిఫికేట్లు, బట్టలు నీటి పాలయ్యాయి.

Next Story