పరీక్షలు లేకుండా పాస్ చేస్తాం..
By అంజి
కరోనా వైరస్ విజృంభణను అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, జిమ్‌లతో సహా పలు సంస్థలు మూతబడ్డాయి. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు పరీక్షలు జరపకుండానే పాస్ చేస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రకటించింది.
Also Read: కరోనా ఎఫెక్ట్: ఆ పరీక్షలన్నీ రద్దు..!
ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు విద్యా సంవత్సరంలోని చివరి పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేస్తామని ఆ రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ తెలిపింది. ఎలాంటి ఆటంకం కలగకుండా విద్యార్థులందరినీ పై తరగతులకు వెళ్లేలా చేస్తామని చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లో ప్రాథమిక పాఠశాలలకు మార్చి 23 నుంచి 28 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.
Also Read: ప్రజలారా.. కుఛ్ కరోనా..!
కాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను రద్దు చేశారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు యోగి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మిగతా తరగతుల విద్యార్థుల పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి వరకు 15 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా పరీక్షల కోసం మొత్తం 72 ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. అయితే మన దేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.