ఆ రోజు అందరూ లైట్స్ ఆఫ్ చేస్తే పెను ప్రమాదమేనా.!

By అంజి  Published on  4 April 2020 6:30 AM GMT
ఆ రోజు అందరూ లైట్స్ ఆఫ్ చేస్తే పెను ప్రమాదమేనా.!

హైదరాబాద్‌: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు, ప్రజల్లో ధైర్యం నింపేందుకు.. ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని, మొబైల్‌ ఫ్లాష్‌ లైట్లు ఆన్‌ చేయాలని ప్రధాని మోదీ చెప్పారు. అదే సమయంలో ఇంట్లో వెలిగే విద్యుత్‌ దీపాలను పూర్తిగా ఆర్పివేయాలని పిలుపునిచ్చచారు. కరోనాపై దేశ ప్రజలు చేస్తున్న పోరాటానికి, అందరం ఐక్యంగా ఉన్నామని చాటేందుకు ప్రధాని మోదీ ఈ పిలుపు ఇచ్చారు. అయితే దీనిని కొందరు సమర్థిస్తుండగా.. మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. దీపాలు వెలగిస్తే.. చీకటి భయాలు తొలిగిపోతాయని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం మమ్మల్ని మరోసారి ఫుల్స్‌ను చేయొద్దు అని అంటున్నారు. దీనికి సంబంధించి కొందరు సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ కూడా చేస్తున్నారు.

Also Read: ఏప్రిల్‌ 15 నుంచి విమాన సర్వీసులు!

అయితే ప్రధాని మోదీ సింబాలిజం కోసం ఇచ్చిన పిలుపు మంచిదైనా.. దీని వల్ల పెద్ద ప్రమాదం ఉందని విద్యుత్‌ నిపుణులు అంటున్నారు. మోదీ చెప్పినట్లు చేస్తే.. పెద ఉపద్రవం వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా లైట్లు ఆర్పివేస్తే.. విద్యుత్‌ గ్రిడ్‌లు కుప్పకూలే ప్రమాదం నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు.. దేశం మొత్తం ఒకేసారి లైట్లు ఆపితే విద్యుత్‌ వ్యవస్థలు కుప్పకూలుతాయని విద్యుత్‌ ఇంజనీర్లు ప్రధాని కార్యాలయానికి తెలిపారని సమాచారం. విద్యుత్‌ వినియోగం ఒకేసారి భారీగా పెరిగినా.. ఒకేసారి భారీగా తగ్గినా.. విద్యుత్‌ గ్రిడ్‌ పని చేయడం నిలిచిపోతుంది. అలా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్‌ ఆఫ్‌ చేస్తే విద్యుత్‌ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యుత్‌ ఇంజనీర్ల మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది. అయితే ఈ సమస్య నుంచి బయట పడడానికి ఓ పరిష్కారం ఉందని నిపుణులు చెబుతున్నారు. లైట్లు ఆర్పివేసే సమయంలో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు వేసి ఉంచడం ద్వారా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని విద్యుతు నిపుణులు అంటున్నారు.

Also Read: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

Next Story