బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం : మంత్రి ఎర్ర‌బెల్లి దయాకర్ రావు

we will treat the victims in all ways says Minister Errabelli.ములుగు జిల్లా మంగ‌పేట మండ‌లం శనగకుంటలో గురువారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 April 2022 1:09 PM IST
బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం : మంత్రి ఎర్ర‌బెల్లి దయాకర్ రావు

ములుగు జిల్లా మంగ‌పేట మండ‌లం శనగకుంటలో గురువారం సాయంత్రం జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో 40 గుడిసెలు ద‌గ్థం కాగా.. ఆ కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌పై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఆ కుటుంబాల‌ను ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ఎవ్వ‌రూ ఆందోళ‌న చెందాల్సిన పని లేద‌న్నారు. విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి ఘటనకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన సహాయక, పునరావాస చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు

ఘటన స్థలాన్ని సందర్శించిన కలెక్టర్ కృష్ణ ఆదిత్య.

ఘ‌ట‌నాస్థ‌లాన్ని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటునాగారం ఏఎస్పి అశోక్ కుమార్ లు శుక్ర‌వారం పరిశీలించారు. బాధిత కుటుంబాలతో, గ్రామస్తులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. రెవిన్యూ డిపార్ట్మెంట్, ఐడిడిఎ ల ద్వారా బాధిత కుటుంబాలకు తగిన సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు పునరావాసం ఏర్పాటు చేస్తామని, తాత్కాలికంగా నివాసం ఉండటానికి ఏర్పాట్లతో పాటు నిత్యావసర సరుకులు అందజేస్తామని హామీ ఇచ్చారు.

కాగా.. పలువురు విద్యార్థుల, యువకుల స్టడీ సర్టిఫికెట్లు, మెమోలు అగ్నిప్ర‌మాదంలో కాలిపోయాయి. ఈ విష‌యాన్ని బాధితులు క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకువెళ్ల‌గా.. సంబంధిత కాలేజీలు యూనివర్సిటీల వారితో మాట్లాడి వాళ్లకు తిరిగి సర్టిఫికెట్లు మెమోలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Next Story