వరంగల్‌కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు

Warangal has been included in the Global Network of Learning Cities. భారతదేశంలోని అనేక నగరాలు అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణలోని వరంగల్‌ నగరం అరుదైన అంతర్జాతీయ

By అంజి
Published on : 6 Sept 2022 9:43 AM IST

వరంగల్‌కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు

భారతదేశంలోని అనేక నగరాలు అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణలోని వరంగల్‌ నగరం అరుదైన అంతర్జాతీయ గుర్తింపు పొందింది. యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) గుర్తించిన అభ్యాసన నగరాల ప్రపంచ నెట్‌వర్క్‌లో వరంగల్‌ నగరానికి చోటు లభించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రసిద్ధ రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ఇప్పటికే గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలోని వరంగల్‌కు ఏడాది వ్యవధిలోనే యునెస్కో నుంచి మరో గుర్తింపు లభించింది.

యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో వరంగల్‌కు చోటు దక్కడం పట్ల కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తించేందుకు నిరంతరం కృషి చేస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా వరంగల్, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు అంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో వరంగల్‌కు చోటు దక్కడం పట్ల తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వరంగల్ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ గుర్తింపు కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మంత్రి కేటీఆర్‌, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.





Next Story