వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాలిక గర్భం దాల్చిందని తెలిసి అబార్షన్ మాత్రలు మింగించడంతో తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిపాలై మృతి చెందిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం రేబల్లెకి చెందిన 14 ఏళ్ల బాలికపై కొద్దికాలంగా ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడుతున్నారు.
ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చిందని తెలియడంతో యువకులు దుర్మార్గానికి ఒడిగట్టారు. ఆమెతో గర్భ విచ్ఛిత్తి మాత్రలు మింగించారు. అవి వికటించి బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. గత నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు యువకులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. అయితే ఘటన జరిగిన పదిరోజుల తర్వాత విషయం వెలుగులోకి రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.