ప్ర‌ధాని మోదీ వరంగల్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఖ‌రారు

Prime Minister Modi's visit to Warangal schedule has been finalized. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న వరంగల్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వివిధ అభివృద్ధి

By Medi Samrat  Published on  4 July 2023 9:06 AM GMT
ప్ర‌ధాని మోదీ వరంగల్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఖ‌రారు

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న వరంగల్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్ర‌ధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేర‌కు షెడ్యూల్ ఖ‌రారైంది. 8వ తేదీ ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో వరంగల్‌కు బయలుదేరుతారు. 10:35గంటలకు వరంగల్‌కు చేరుకుంటారు. అక్క‌డ‌ భద్రకాళి ఆలయాన్ని సందర్శిస్తారు.

11:30 నిమిషాలకు సభా ప్రాంగణానికి చేరుకొని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 12:10 నిమిషాల వరకు మోదీ ప్రసంగం ఉంటుంది. 12:15 నిమిషాలకు ప్రధాని మోదీ తిరిగి వరంగల్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. మధ్యాహ్నం 1:10గంటలకు మోదీ హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రధాని మోదీ వరంగల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కాజీపేట‌లో వ్యాగన్‌ల తయారీ యూనిట్‌కు, అలాగే జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.


Next Story