డ్రోన్స్‌ నిషేదం.. ప్రధానికి మూడంచెల భద్రత : వరంగల్ సీపీ

High security arrangement during Prime Minister Modi's visit. రేపు వరంగల్ పర్యటనకు వస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి మూడంచెల భద్రత కల్పించబడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వెల్లడించారు

By Medi Samrat  Published on  7 July 2023 3:14 PM GMT
డ్రోన్స్‌ నిషేదం.. ప్రధానికి మూడంచెల భద్రత : వరంగల్ సీపీ

రేపు వరంగల్ పర్యటనకు వస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి మూడంచెల భద్రత కల్పించబడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వెల్లడించారు. ప్రధాని పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లతో పాటు, ట్రాఫిక్ మళ్ళీంపు, పార్కింగ్ స్థలాల ఏర్పాటుపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ భద్రత ఏర్పాట్లపై మాట్లాడుతూ.. గత నాలుగు రోజుల నుండి స్పెషల్ ప్రోటీక్షన్ గ్రూప్ స్థానిక పోలీసులతో కల్పి ప్రధాని రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ప్రధాని పర్యటన కోసం మొత్తం 3వేల ఐదువందల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని ఇందులో ప్రధానికి రక్షణ కల్పించడం కోసం వరంగల్ సీపీతో పాటు ఇద్దరు డీఐజీలు, ఎస్పీ లు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్-ఇన్స్స్పెక్టరు, హెడ్ కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్ళు, హోంగార్డుల‌తో పాటు గ్రేహౌండ్స్, పారమిలటరీ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.

ముఖ్యంగా ప్రధాని పర్యటనను దృష్టిలో వుంచుకోని ట్రాఫిక్ మళ్ళీంపు జరిగిందని, అలాగే ప్రధాని బహిరంగ సభ కోసం వచ్చేవాహనాల పార్కింగ్ స్థలాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయని సీపీ అన్నారు. ఈ సందర్భంగా ట్రై సిటీ పరిధిలో 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు ట్రై సిటీ గగనతలంలో 20కిలో మీటర్ల పరిధిలో నోప్టిజోన్ ప్రకటించడం జరిగిందని సీపీ అన్నారు. అందు వలన డ్రోన్, రిమోట్ కంట్రోల్తో పనిచేసే మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్, పారాగ్లైడర్ లాంటివి ఎగరవేయడం పూర్తిగా నిషేదించబడ్డాయి. ఎవరైన వ్యక్తులుగాని, సంస్థలుగాని ఉత్తర్వులను అతిక్రమించినట్టయితే అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని సీపీ హెచ్చరించారు.

అయితే ముఖ్యంగా రేపటిరోజు పబ్లిక్ సర్వీసు కమిషన్ కు సంబంధించిన వ్రాత పరీక్ష నిర్వహింబడుతోంది. కావున పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు ఉదయం ఎనిమిది గంటలలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని.. ఎవరికైనా ఇబ్బంది కలిగితే పరీక్ష హాల్ టికెట్ చూపించాల్సి వుంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రధాని ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రేపటి రోజున అదాలత్ సెంటర్ నుండి కలెక్టర్ బంగ్లా మార్గంలో ఎలాంటి వాహనాలను అనుమతించబడవని పోలీస్ కమిషనర్ తెలియజేసారు. అనంతరం ట్రాఫిక్ మళ్ళింపు, వాహనాల పార్కింగ్ స్థలాలకు సంబంధించిన సమచారాన్ని ఈస్ట్ జోన్ డీసీపీ కరుణాకర్ వివరించారు. ఈ సమావేశంలో క్రైమ్స్ డీసీపీ మురళీధర్, సెంట్రల్ జోన్ డీసీపీ యమ్. ఏ బారి, ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ పాల్గోన్నారు.


Next Story