వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఘనస్వాగతం పలికారు.

By Medi Samrat  Published on  29 Jun 2024 6:00 PM IST
వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఘనస్వాగతం పలికారు. వనమహోత్సవంలో భాగంగా వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌లో మొక్కలు నాటి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించారు.

టెక్స్‌టైల్ పార్కుకు భూములిచ్చిన వారికి తొలుత ఇళ్ల స్థలాలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ప్లాట్లతో పాటు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇచ్చే అవకాశం ఉందో లేదో పరిశీలించాలని అధికారులను సీఎం అదేశించారు. 1,200కు పైగా ఇళ్లను నిర్మిస్తే గ్రామ పంచాయతీగా డిక్లేర్ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. టెక్స్‌టైల్ పార్కు సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు సమీపంలో వరద నీటిని స్టోర్ చేసేలా పది ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో చెరువును ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. టెక్స్‌టైల్ పార్కుకు సమీపంలో వచ్చే వరద నీటిని ఈ చెరువులోకి మళ్లించి వాటిని నిల్వ ఉంచాలని సూచించారు.

Next Story