ఆ విషయంలో సీఎం కేసీఆర్ అత్యంత సీరియస్ గా ఉన్నారు

Chief Minister KCR is very serious about women's safety. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇంటిగ్రేటేడ్ సపోర్ట్ సెంటర్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ అధ్వర్యంలో

By Medi Samrat  Published on  25 Nov 2022 11:37 AM GMT
ఆ విషయంలో సీఎం కేసీఆర్ అత్యంత సీరియస్ గా ఉన్నారు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇంటిగ్రేటేడ్ సపోర్ట్ సెంటర్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ అధ్వర్యంలో జెమిని ఎడిబెల్స్ అండ్ ఫ్యాట్ ప్రైవేటు కంపెనీ సహకారంతో వరంగల్ రంగంపేట్ లోని పోలీస్ లైన్స్ నూతనంగా నిర్మిస్తున్న భరోసా కేంద్రం నూతన భవన నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మట్లాడుతూ.. మహిళా భద్రత విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత సీరియస్ గా ఉన్నారని అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా షీ టీమ్స్ భరోసా కేంద్రాలు పెట్టి వారి భద్రతకు పెద్దపీట వేసారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

రాష్ట్రంలో ఆరాచకాలు చేసేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహిళల విషయంలో ప్రజల్లో మార్పు తీసుకురావాలని అధికారులను కోరడంతో పాటు భరోసా కేంద్రం ఏర్పాటుతో పాటు ప్రజల్లో మార్పులు తీసుకురావాలి. సమాజంలో అత్యాచారాలు చేసేవాళ్ళు వున్నారు. వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, మహిళ భద్రత విషయంలో ముఖ్యమంత్రి పట్టుదలతో వున్నారని అన్నారు. నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోలీసులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ఏవరు ఇవ్వలేదని, గత ప్రభుత్వాల్లో పోలీసులకు సరైన వాహనాలు లేక అద్దె జీపుల్లో విధులు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం పోలీసులకు అధునాతన వాహనాలను అందజేబడ్డాయని, అలాగే హోంగార్డులకు ఇర‌వై వేల రూపాయ‌లు గౌరవవేతనాన్ని అందిస్తోందని అన్నారు.

మహిళల విషయంలో గతంలో ఆరాచకాలు జరిగేవి. నా దగ్గరకు రోజూ చాలా మంది మహిళా భాదితులు వచ్చే వారు, కానీ ఇప్పుడు అలాంటి ఫిర్యాదులు దాదాపు రావడం లేదు. మహిళలు భరోసా కేంద్రాలకు రాకుండా చూడాలి. వచ్చినా వారికి అన్ని విధాల సాయం చేయాలి. జనగాం జిల్లాలోను త్వరలో నూతనంగా భరోసా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున జనగాంలోను భరోసా కేంద్రానికి జెమిని సంస్థ నూతన భవన నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రస్తుత వరంగల్ పోలీస్ కమిషనర్ డైనమిక్ గా ఉంటూ సీఎం ఆలోచనలు అమలు చేస్తూ ప్రజల్లో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి అన్నారు.


Next Story