వరంగల్ బీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి మరోసారి ఆ వార్తల్లో నిలిచాడు. గతంలో చికెన్, మద్యం బాటిళ్లు పంపిణీ చేసి వార్తల్లో నిలిచిన రాజనాల శ్రీహరి.. తన వినూత్నపంథాను కొనసాగిస్తున్నాడు. అయితే.. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే రాజనాల శ్రీహరి కూడా మార్కెట్‌లో అధిక ధర పలుకుతున్న టమాటాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. వరంగల్ పట్టణంలో చేపట్టిన టమాట బుట్టల పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి రెండు కిలోల చొప్పున టమాటాలు పంచిపెట్టాడు. వందల మంది మహిళలు క్యూలో నిలబడి టమాటాలను తీసుకెళ్లారు. అయితే.. టమాటో బుట్టలు తీసుకోవడానికి మహిళలతో పాటు పురుషులు కూడా అక్కడకు భారీగా ఎత్తున చేరుకున్నారు. కేవలం మహిళలకు మాత్రమే టమాటాలు పంచి పెడతానని ప్రకటించడంతో.. తమకు కూడా టమాటాలు పంచాలంటూ పురుషులు ఆందోళనకు దిగారు. టమాట పంపిణీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.