ఘోర రోడ్డుప్ర‌మాదం.. ముగ్గురు మృతి

3 killed and 3 injured in road mishap. వ‌రంగ‌ల్‌ జిల్లాలోని ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామ శివారులోని పర్షా తండా సమీపంలో

By Medi Samrat
Published on : 18 May 2022 4:03 PM IST

ఘోర రోడ్డుప్ర‌మాదం.. ముగ్గురు మృతి

వ‌రంగ‌ల్‌ జిల్లాలోని ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామ శివారులోని పర్షా తండా సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను గుగులోతు స్వామి (45), గుగులోతు సీత (35), జాతోహు బుచ్చమ్మ (60)గా గుర్తించారు. గాయపడిన మరో ముగ్గురిని గుగులోతు గోవింద్, గుగులోతు విజయ, గుగులోతు శాంతగా గుర్తించారు. బాధితులంతా బంధువులే. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నర్సంపేట ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









Next Story