గంటల వ్యవధిలో యువతి హత్య కేసును చేధించిన పోలీసులు
By Newsmeter.Network Published on 28 Nov 2019 8:08 PM ISTముఖ్యాంశాలు
- వరంగల్ యువతి హత్యపై దర్యాప్తు వేగవంతం
- కొన్ని గంటల్లోనే కీలక అంశాలను రాబట్టిన పోలీసులు
- సిబ్బందిని అభినందించిన కమిషనర్
దీన్ దయాల్ నగర్ కు చెందిన యువతి హత్య సంబంధించిన కేసులో ఈ రోజు నిందితుడుని సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుడి నుంచి ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు జనగామ జిల్లా, ఘన్‌పూర్ మండలం, నెమిలిగొండ్ల గ్రామానికిచెందిన పులిపాయిగౌడ్ ఆలియాస్ సాయికుమార్ ను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుడు హంటర్‌రోడ్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో డీగ్రీ చివరి సంవత్సరం చదువుచుండగా . మృతురాలు మానస హంటర్‌రోడ్డులోని లమ జంక్షన్ వద్ద తండ్రితో కలిసి కూరగాయల వ్యాపారం నిర్వహిస్తునే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు తెలిపారు. ఈ క్రమములో నిందితుడు కాలేజీకి వచ్చిపోయే క్రమంలో గత ఆరు నెలల క్రితం మృతురాలు, నిందితుడుకి మధ్య పరిచయం కావడంతో నిందితుడు మృతురాలి మధ్య మాటలు కలవడంతో పాటు ఇరువురు సెల్‌ఫోన్‌ల్లో కొద్ది రోజులుగా మాట్లాడుకున్నట్లు తమ విచారణలో తేలినట్లు తెలిపారు.
ఇలా కొద్ది రోజుల గడిచిన తరువాత నిన్న మృతురాలి పుట్టిన రోజు కావడంతో నిందితుడు మృతురాలిని తనను కలిసేందుకు రమ్మని నిందితుడు ఫోన్ ద్వారా తెలుపడంతో మృతురాలు తాను భద్రకాళి గుడికి వెళ్ళి వస్తానని తన తల్లికి చెప్పి వెళ్లిందని, గుడికి బయలుదేరిన యువతి మానస ఎంతకి తిరిగి రాకపోవడంతో టెన్షన్ పడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృత దేహాన్ని కనుగొన్నారు. అయితే యువతి కోర్టు జంక్షన్ వద్ద వేచిచూస్తుండగా నిందితుడు కాజీపేట వైపు రమ్మని తిరిగి మృతురాలికి ఫోన్‌ల్లో తెలిపడంతో కాజీపేటకు వెళ్ళి అక్కడ వేచిచూస్తున్న యువతిని నిందితుడు కారులో వచ్చి మానసను కారులో ఎక్కించుకొని బయలుదేరినట్లు వివరించారు. చిన్న పెండ్యాల రైల్వే ట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో కారును నిలిపివేసి యువతిపై నిందితుడు అత్యాచార యత్నం చేశాడని పేర్కొన్నారు. దీంతో యువతికి తీవ్ర రక్తస్రావం కావడంతో కొట్టుమిట్టాడుతూ మృతి చెందినట్లు తెలిపారు.
హత్యనేరం తనపై రాకుండా ఉండేందుకు...
మానస మరణించడంతో ఈ హత్యనేరం తనపై రాకుండా ఉండేందుకుగాను మానస శవాన్ని తరలించేందుకుగా గాను నిందితుడు తన మిత్రులకు సమాచారం అందించాడని, అక్కడికి చేరుకున్న ఇద్దరు మిత్రులు శ్రీకాంత్, శ్రీకాంత్‌లు సంఘటన స్థలానికి చేరుకోని, శవంగా పడివున్న మానస మృతదేహాన్ని చూసిన నిందితుడి మిత్రులు నిందితుడుకి సహాయం చేసేందుకు అంగీకరించక, సంఘటన స్థలం నుంచి తిరిగి వెళ్ళిపోయారని కమీషనర్ రవీందర్ తెలిపారు.
కారులో శవాన్ని వేసుకుని...
చివరకు నిందితడు ఒంటరిగానే మానస మృతదేహాన్ని కారులో వేసుకొని చీకటి అయ్యే వరకు చిన్న పెండ్యాల, హుస్నాబాద్, ఎల్కతుర్తి , కేయూసి సెంటర్ మీదుగా అశోక టాకీస్ జంక్షన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్న నిర్మానుష ప్రదేశంలో నిందితుడు కారును నిలిపివేసి మానస హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు కాలేజీ సమీపంలోని బట్టల షాపులో పంజాబీ డ్రసు కోనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. తిరిగి కారులో బయలుదేరి హంటర్ రోడ్‌లోని న్యూశాయంపేటలోని రైల్వేట్రాక్ వద్ద నిందితుడు రక్తసిక్తమైన మృతురాలి శరీరం నుండి బట్టలను తోలగించిన కొనుగోలు చేసిన బట్టలను మానస మృతదేహానికి అలకరించాడు. తిరిగి కొత్త బట్టలను వేసిన మానస మృతదేహన్ని నిందితుడు హంటర్ రోడ్‌లోని విష్ణుప్రియ గార్డెన్ పరిసరాల ప్రాంతానికి కారులో చేరుకున్నట్లు వివరించారు. ఎవరు లేని నిర్మానుష్య ప్రదేశంలో పడవేసిన అనంతరం నిందితుడు తన కారుతో తాను నివాసం ఉంటున్న నెమిలిగోండ్ల గ్రామానికి తిరిగి వెళ్ళిపోయాడని చెప్పారు.
హత్యకు గురైన మానస అన్నయ్య గాదం శ్రీనివాస్ ఇచ్చిన పిర్యాదుపై కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులు దర్యాప్తు నిర్వహించి మానసను నిందితుడు సాయిగౌడ్ హత్య చేసినట్లుగా ప్రాధమిక సాక్ష్యాధారాలను సేకరించిన సుబేదారి పోలీసులు ఈ మధ్యాహ్నం నెమిలిగొండ్లలో నివాసం ఉంటున్న నిందితుడితో పాటు ఆయన ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకొని ముద్దాయిని కోర్టులో హాజరు పర్చడం జరుగుతుందన్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
సిబ్బందిని అభినందించిన కమిషనర్ :
గంటల వ్యవధిలో నిందితుడుని అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డీసీపీ నాగరాజు, హన్మకొండ, వరంగల్ ఏసీపీ జితేందర్ రెడ్డి, సారంగపాణి, సుబేదారి ఇన్స్‌స్పెక్టర్ ఆజయ్, టాస్క్‌ఫోర్స్ , ఘన్‌పూర్ ఇన్స్‌స్పెక్టర్లు నందిరాంనాయక్, రాజీరెడ్డి, సుబేదారి ఎస్సైలు మహేందర్, రవి కానిస్టేబుళ్ళు అనిల్, రాము, వెంకన్న, రమేష్, లింగమూర్తిలను పోలీస్ కమిషనర్ అభినందించారు.