మహిళపై టీడీపీ నేత అత్యాచారయత్నం.. కోరిక తీర్చుతావా.. లేదంటే..

By అంజి  Published on  26 Jan 2020 3:56 PM IST
మహిళపై టీడీపీ నేత అత్యాచారయత్నం.. కోరిక తీర్చుతావా.. లేదంటే..

విశాఖ: దిశ లాంటి చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చినా.. కామాంధుల్లో ఏ మాత్రం భయం కనిపించడం లేదు. అందులోనూ తాము ఇంకా అధికారంలోనే ఉన్నామనే ధీమాతో కొందరు మరింత రెచ్చిపోతున్నారు. కాటికి కాలు చాపే వయస్సులో సాధారణంగా ఏ వ్యక్తి అయినా రామ.. కృష్ణా.. అనుకోవడం సహజం. కానీ ఆ నేత మాత్రం తన ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న ఓ మహిళను లైంగిక వాంఛ తీర్చమంటూ వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటన నర్సీపట్నం నియోజకవర్గం గోలుకోండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఒప్పుకోకపోతే.. భూ సమస్య పరిష్కారం కాకుండా చేస్తానని బెదిరింపులకు గురి చేశాడు. జిల్లా టీడీపీ నేత, నర్సీపట్నం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అప్పలనాయుడు కొంతకాలంగా ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్నాడు.

గోలుకొండ మండలంలోని జోగింపేటలో తన ఇంటికి ఎదురుగా నివసిస్తున్న మహిళను, భర్త ఇంట్లో లేని సమయంలో మహిళను వేధిస్తున్నాడు. ఇంటి స్థల సమస్య పరిష్కారం కావాలంటే తన కోరిక తీర్చాలంటూ రెచ్చిపోయాడు. దీంతో కొంతకాలంగా సహనంతో ఓర్చుకున్న ఆ బాధితురాలు, అప్పటికే టీడీపీ పార్టీ రూలింగ్‌లో ఉండడంతో నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. అయితే తాజాగా ఈ నెల 23న అర్థరాత్రి ఫూటుగా మద్యం తాగి వచ్చి మహిళపై అప్పలనాయుడు అత్యచార యత్నానికి ఒడిగట్టాడు. దీంతో బాధితురాలు గోలుకోండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతను చేసిన వికృత చేష్టలు, లైంగిక వేధింపులపై తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పలనాయుడుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

Next Story