విశాఖ: గ్యాస్‌ లీక్‌తో మూగ జీవాలు విలవిల.. 2వేల మందికిపైగా అస్వస్థత

By సుభాష్  Published on  7 May 2020 8:22 AM IST
విశాఖ: గ్యాస్‌ లీక్‌తో మూగ జీవాలు విలవిల.. 2వేల మందికిపైగా అస్వస్థత

విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారరుజామున పరిశ్రమ నుంచి భారీ మొత్తంలో రసాయన వాయువు లీక్‌ కావడంతో ఇప్పటి వరకూ ముగ్గురు మృతి చెందారు. 2వేలకుపైగా పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రోడ్డుపై వెళ్తున్నవారు ఎక్కడికక్కడే సొమ్మసిల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మృతి చెందిన వారిలో ఇద్దరు కళ్లు కనిపించకపోవడంతో కాలువలో పడి మృతి చెందారు. అందులో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మూగ జీవాలు సైతం ఈ విష వాయువు పీల్చి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాయి. కుక్కలు, గేదెలు, ఇతర మూగ జీవాలు సైతం ఎక్కడికక్కడే తీవ్ర అస్వస్థతకు గురై పడిపోతున్నాయి.

001

అయితే ఈ విష వాయువు పీల్చిన ప్రజలను హుటాహుటిన పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిశ్రమ ఉన్న పరిసర ప్రాంతాల్లో 5 గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడు కిలోమీటర్ల మేర ఈ విష వాయులు వ్యాపించింది.

గ్యాస్‌ లీక్‌ కావడంపై అప్రమత్తమయ్యామని కలెక్టర్‌ నవిన్‌ చంద్‌ చెబుతున్నారు. చాలా మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వారందరిని ఆస్పత్రికి తరలించి చికితస అందిస్తున్నామని అన్నారు. మూడు కిలోమీటర్ల మేర ఈ వాయువు వ్యాప్తించిందని, పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు.

[video width="640" height="352" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/WhatsApp-Video-2020-05-07-at-8.04.45-AM.mp4"][/video]

Next Story